విశాఖ నగరం ప్రస్తుతం.. జల సాగరానికి పోటీగా జన సాగరాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా ప్రజలే దర్శనమిస్తున్నారు. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా ప్రకటించిన సీఎం జగన్‌కు వైజాగ్ వాసులు ఘన స్వాగతం పలికారు. జగన్.. సభకు వెళ్లే రహదారి మొత్తం ప్రజలు నిండిపోయారు. ఏకంగా 24 కిలోమీటర్ల పొడవునా మానవహారంగా ఉంటూ ప్రజలు జగన్‌కు స్వాగతం పలికారు. జగన్ వస్తోన్న కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. కాగా.. కొంతమంది అభిమానులు జగన్ కాన్వాయ్‌కి అడ్డురావడంతో.. కొన్ని చోట్ల కాన్వాయ్ ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా.. రూ.12 వందల కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం.
కాగా.. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా స్టీల్ సిటీలో హడావిడి అంతా ఇంతా లేదు. విద్యార్థుల డ్యాన్సులు, నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. సెంట్రల్ పార్క్ ఈ ఉత్సవ్‌కు వేదికైంది. వివిధ దేశాలకు చెందిన 50కి పైగా పుష్ప జాతుల రకాలు అక్కడ కనువిందు చేస్తున్నాయి. వివిధ ఆకృతుల్లో పుష్పాలను అమర్చారు. రూ.60 లక్షలతో అక్కడ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు.