జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్..!

|

Jun 05, 2020 | 9:28 PM

ఇసుక సరఫరా విషయంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్లైన్ పోర్టల్ నుంచి వెంటనే బల్క్ ఆర్డర్లను తొలగించాలని ఆదేశించారు.

జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్..!
Follow us on

ఇసుక సరఫరా విషయంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్లైన్ పోర్టల్ నుంచి వెంటనే బల్క్ ఆర్డర్లను తొలగించాలని ఆదేశించారు. అంతేకాకుండా బల్క్ ఆర్డర్స్‌కు అనుమతులను జేసీలకు అప్పగించాలని తెలిపారు. ఇక ఇసుక రీచ్‌ల దగ్గర ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతేకాక నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండాలని స్పష్టం చేశారు. కాగా, చిన్న నదుల నుంచి ఎడ్ల బండ్లపై సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లేందుకు స్థానికులను అనుమతివ్వాలని సీఎం జగన్ సూచించారు.

ఇది చదవండి: కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!