సీఎం హోదాలో మొదటిసారి వైఎస్ జగన్ హైదరాబాద్‌కు రానున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఇవాళ సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ విందు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. ఇక రాజ్‌భవన్ ఇఫ్తార్ విందు అనంతరం జగన్ లోటస్‌పాండ్‌కు వెళ్తారు. రేపు సాయంత్రం వరకు అక్కడే ఉండే అవకాశం ఉంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్‌ను కలుస్తారని సమాచారం. అలాగే గుంటూరులో జూన్ 3న ఏపీ ప్రభుత్వం తరుపున ఇచ్చే ఇఫ్తార్ విందుకు కూడా జగన్ హాజరవుతారు.