104కి కాల్ వస్తే కలెక్టర్లు వెంటనే స్పందించాలి

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పీహెచ్‌సీలు, యుహెచ్‌పీలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రలు, జీజీహెచ్‌ లన్నింటిలో..

104కి కాల్ వస్తే కలెక్టర్లు వెంటనే స్పందించాలి
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 08, 2020 | 4:31 PM

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పీహెచ్‌సీలు, యుహెచ్‌పీలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రలు, జీజీహెచ్‌ లన్నింటిలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి ఉండాలన్నారు. రాష్ట్రప్రజలకు కోవిడ్‌ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి తలెత్తకూడదన్నారు. వీటికి సంబంధించి అన్ని అవసరాలకు 104 కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకోవాలి. ఈ నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మంగళవారం ఆయన అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 104 కాల్‌ సెంటర్ ‌నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలన్నారు. ఆ ఫోన్‌ కాల్స్‌పై ఎలా రెస్పాండ్‌ అవుతున్నామనేదే పని తీరుకు అద్దం పడుతుందని జగన్ కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్‌ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్‌ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలని జగన్ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.