జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో నాలుగు జోన్లు ఏర్పాటు.!

|

Aug 03, 2020 | 8:39 AM

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు...

జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో నాలుగు జోన్లు ఏర్పాటు.!
Follow us on

Four Zones In AP: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలని భావిస్తున్నారు. దీనిపై ఇవాళ మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు.

రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి.. వాటికి చైర్మన్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించే ముందే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రా, కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.

Also Read: కరోనా డేంజర్ బెల్స్.. ఏపీలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్.!