కలుసుకున్న చంద్రబాబు, పవన్.. నవ్వుతూ ముచ్చట్లు..!

ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనవరాలు వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, సినీ నటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే.. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇరువురూ ఒకేసారి ఎదురుపడడంతో చిరునవ్వులతో పలకరించుకున్నారు. వధూవరులను ఆశీర్వదించి, తిరుమల శ్రీవారి ప్రసాదాలను బహుమతిగా అందించిన చంద్రబాబు, వేదిక దిగగానే పవన్ కల్యాణ్ ఎదురు పడ్డారు. ఇరువురూ నమస్కార, […]

కలుసుకున్న చంద్రబాబు, పవన్.. నవ్వుతూ ముచ్చట్లు..!

Edited By:

Updated on: Apr 20, 2019 | 1:28 PM

ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనవరాలు వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, సినీ నటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే.. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇరువురూ ఒకేసారి ఎదురుపడడంతో చిరునవ్వులతో పలకరించుకున్నారు. వధూవరులను ఆశీర్వదించి, తిరుమల శ్రీవారి ప్రసాదాలను బహుమతిగా అందించిన చంద్రబాబు, వేదిక దిగగానే పవన్ కల్యాణ్ ఎదురు పడ్డారు. ఇరువురూ నమస్కార, ప్రతినమస్కారాలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు. అయితే.. గత సంవత్సరంలో అమరావతిలో ఓ ఆలయ విగ్రహ ప్రతిష్టలో కలుసుకున్న వీరిద్దరూ మళ్లీ ఎదురెదురుగా తారసపడటం ఇదే తొలిసారి.