ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్

|

Sep 22, 2020 | 5:08 PM

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలతో సహా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఈ ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు...

ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీకి పయనమయ్యారు. దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో  సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో వైఎస్ జగన్ భేటీ అవ్వనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలతో సహా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఈ ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు. క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిల వివరానలు ఆయన అడిగి తెలుసుకోనున్నారు.

ఈ రోజు రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. అదేరోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆరోజు రాత్రి తిరుమలలోనే బస చేసి ,గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొనున్నారు.