ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే..!

| Edited By:

Oct 16, 2019 | 7:32 AM

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. రాజధాని ప్లాన్‌లో మార్పులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కంటి వెలుగు రెండో దశ అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతు భరోసా పథకంలో లబ్ధి దారుల ఎంపిక, నిధుల కేటాయింపు వంటి అంశాలను కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక పోలవరంలో రివర్స్ టెండరింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన […]

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే..!
Follow us on

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. రాజధాని ప్లాన్‌లో మార్పులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కంటి వెలుగు రెండో దశ అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతు భరోసా పథకంలో లబ్ధి దారుల ఎంపిక, నిధుల కేటాయింపు వంటి అంశాలను కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక పోలవరంలో రివర్స్ టెండరింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం.. నవరంబర్ 1 నుంచి ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు అవసరమైన చర్యలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. వాహన మిత్ర పథకం అమలుతో పాటు నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ. 10వేల సాయం అందించే పథకంపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. స్ధానిక సంస్ధలు, సహకార ఎన్నికలకు తీసుకోవాల్సిన చర్యలు, మున్సిపాలిటీల విలీనం వంటి అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.