కరోనా విపత్తు వేళ.. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలని..: జగన్‌కు కన్నా లేఖ

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసారు. కోవిద్-19 విపత్తు వేళ పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో

కరోనా విపత్తు వేళ.. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలని..: జగన్‌కు కన్నా లేఖ

Edited By:

Updated on: May 11, 2020 | 11:53 AM

AP BJP Chief Kanna Lakshmi Narayana: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసారు. కోవిద్-19 విపత్తు వేళ పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఉదహరించారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరలు రద్దు చేయాలని, బిల్లులు ఉపసంహరించాలని కన్నా పేర్కొన్నారు.

మరోవైపు..  విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ రాసారు. విశాఖ ఘటన పూర్తిగా మానవ వైఫల్యమేనని పేర్కొన్నారు. గురువారం రాత్రి 9.30కే స్టైరిన్ ట్యాంకులలో ఉష్ణోగ్రతలు 154డిగ్రీలకు చేరినా గుర్తించలేదని, ప్లాంట్ లో భద్రత ప్రమాణాలను కొరియా కంపెనీ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.

బాధ్యులపై పెట్టి కేసులు పెట్టడం సరి కాదు, ప్రమాదాలు జరిగినపుడు ఏమి చేయాలో కంపెనీ స్థానిక ప్రజలకు ఎప్పుడు వివరించలేదని లేఖలో వివరించారు. కాలుష్య నియంత్రణ విషయంలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయి, పరిహారంతో ఇలాంటి ప్రమాదాలకు ఊరట లభించదని కన్నా తెలిపారు. ప్రమాదానికి కారణమైన ప్రభుత్వ అధికారులు, కంపెనీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.