స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలు వాయిదా..?

శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు.ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసుకుంటున్నట్లు బోర్డు అధికారులు చెప్పారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలు వాయిదా..?

Edited By:

Updated on: Mar 06, 2020 | 10:10 PM

శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు.ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసుకుంటున్నట్లు బోర్డు అధికారులు చెప్పారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను ఎన్నికల ప్రక్రియ అనంతరం ఏప్రిల్‌లో నిర్వహిస్తామని తెలిపారని వివరించారు.

విజయవాడలోని ఈసీ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్‌ సమావేశమయ్యారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సైతం పరీక్షల వాయిదా దోహదపడుతుందని చెప్పారు. అధికారులు ఇచ్చిన స్పష్టత కూడా ఎన్నికలు నిర్వహించేందుకు దోహదపడిందన్నారు. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.