అనుష్క ‘నిశ్శబ్దం’కు టాటా చెప్పేస్తోంది
టాలీవుడ్ కే కాదు యావత్ దక్షిణాదికి స్వీటీ హీరోయిన్ అయిన అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా రిలీజ్ కాబోతోంది. లాక్ డౌన్ కు ముందు థియేటర్ల కోసం చాలా కాలం వెయిట్ చేసిన..

టాలీవుడ్ కే కాదు యావత్ దక్షిణాదికి స్వీటీ హీరోయిన్ అయిన అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా రిలీజ్ కాబోతోంది. లాక్ డౌన్ కు ముందు థియేటర్ల కోసం చాలా కాలం వెయిట్ చేసిన ‘నిశ్శబ్దం’ సినిమా మొత్తానికి ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతోంది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఓటీటీ నుంచి చిత్రనిర్మాతలకు మంచి ఆఫరే వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 5న అమేజాన్ ప్రైమ్‌లో ‘వి’ సినిమా విడుదల కాబోతుండగా, ఆ తర్వాత సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ వస్తుంది. ఆ తర్వాత ‘నిశ్శబ్దం’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. అటు, కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ కూడా ఇదే ఫ్లాట్ ఫాంలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే, అనుష్కశెట్టి కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి హిందీ వెర్షన్ యూట్యూబ్ లో ఇప్పుడు సంచలనం రేపుతోంది. అల్లు అర్జున్, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, నిత్య మెనన్, బాబా సెహగల్, కేథరీన్ లతో కూడిన భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్న సంగతి తెలిసిందే. రాణి రుద్రమదేవి చరిత్రను ఆధారం చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్. ఇప్పటివరకూ ఈ సినిమా హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో 150 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి.



