AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగిషీలు అద్దుకుంటున్న అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి నూతన రథం..రంగులు మినహా అన్ని పనుల్ని పూర్తి

దైవకార్యం ఏదైనా వేగంగానే జరుగుతుంది. భక్తుల విశ్వాసం, దేవతమూర్తుల శక్తికి పాలకుల చొరవ తోడేతే..ఎంతటి కార్యక్రమం అయిన బ్రహ్మాండమే అవుతుంది. అంతర్వేదిలో కూడా ఇప్పుడు అలాంటిదే జరుగుతోంది.

నగిషీలు అద్దుకుంటున్న అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి నూతన రథం..రంగులు మినహా అన్ని పనుల్ని పూర్తి
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2020 | 9:27 PM

Share

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మినరసింహస్వామి నూతన రథం నగిషీలు అద్దుకుంటోంది. రంగులు మినహా అన్ని పనుల్ని పూర్తి చేసారు శిల్పులు. ఏపీ దేవాదాయ శాఖ దగ్గరుండి ఈ రథం పనులను పర్వేక్షిస్తోంది. అధికారులతో పాటు 20 మంది నిపుణులతో నూతన రథం నిర్మాణ బాధ్యతల్ని చూస్తున్నారు. 1450 అడుగుల నాణ్యమైన బస్తర్ కలపతో ఏడు అంతస్తులు ఉండేలా రథాన్ని డిజైన్ చేశారు.

42 అడుగుల పొడవు 14 అడుగుల వెడల్పుతో నూతన రధం నిర్మాణం జరిగింది. స్వామివారి రథం పనుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ముందు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి అద్భుతంగా నిర్మిస్తోంది. మొదట రూ. 95లక్షలు కేటాయించినప్పటికి నూతన హంగులతో తయారు చేయించడంతో కోటి 10 లక్షల వరకూ రధం నిర్మాణానికి ఖర్చు అయింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జరిగే లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి నూతన రథం సిద్ధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం …అంతే వేగంగా పనులు పూర్తి చేస్తోంది. ఈ రథం నిర్మాణ పనుల్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు పూర్తి కావస్తున్న రథం ఈసారి స్వామివారి కల్యాణోత్సవం వేళ భక్తులకు దర్శనమివ్వనుంది.

అంతర్వేది ఆలయం వెలుపల ఉన్న పాత రథం సెప్టెంబర్ 5న అర్ధరాత్రి మంటల్లో కాలిపోంది. రథం కాలిపోవడంతో భక్తుల సెంటిమెంట్‌తో పాటు ధార్మిక సంస్థలు దేవాదాయ శాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాయి. దీంతో నూతన రథం నిర్మిస్తామన్న ప్రభుత్వం సింహాద్రి గణపతాచారి అనే నిపుణుడికి ఈ రథం పనుల్ని అప్పగించింది. గతంలో పలు ఆలయాల్లో రథాలు తయారు చేసిన అనుభవం ఉండటంతో అంతర్వేది రథాన్ని అనుకున్న సమయం కంటే ముందే సిద్ధం చేస్తున్నారు శిల్పులు, నిపుణులు.