గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి వరుస గా షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ఆ పార్టీ నుంచి కీలక నేతలు చేజారుతున్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరనున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే ఒకరోజు ముందు మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ ఢిల్లీకి వచ్చే కార్యక్రమం ఉందని, ఆయన కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫొటోను తొలగించారని మీడియాలో వార్తలు రావడం చర్చకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం కమల్ నాథ్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కమల్ నాథ్ ఈ సాయంత్రం ఆలస్యంగా న్యూఢిల్లీలో ఉంటారని, ఇక్కడే ఆయన పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే, ఇది కేవలం పుకారు మాత్రమేనని, కమల్‌నాథ్ ఎప్పుడూ అలాంటి పనిచేయబోడని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను మాత్రం అవన్నీ ఊహాగానాలేనని బదులిచ్చారు. కమల్ నాథ్ బీజేపీలో చేరతారా అనే ప్రశ్నకు కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. “నేను నిన్న రాత్రి కమల్ నాథ్ జీతో మాట్లాడాను. అతను చింద్వారాలో ఉన్నాడు. నెహ్రూ-గాంధీ కుటుంబంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఆ వ్యక్తి సోనియా గాంధీ, ఇందిరా గాంధీ కుటుంబాలను విడిచిపెడతారని నేను అనుకోవడం లేదు. ఇక కమల్ నాథ్ బీజేపీలో చేరడంపై వస్తున్న ఊహాగానాలపై బీజేపీ చీఫ్ వీడీ శర్మను ప్రశ్నించగా.. “ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎల్లప్పుడు మేము మా తలుపులు తెరిచి ఉంచాం. కాంగ్రెస్ వారిని బహిష్కరించింది. దానితో వారు బాధలో ఉన్నారు. నిరాశ చెందిన వారికి మేం అవకాశం ఇస్తాం’’ అని ఆయన రియాక్ట్ అయ్యారు.
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఇటీవల మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు బీజేపీకి గూటికి చేరారు. ఆయన బాటలోనే మరికొంత మంద కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇండియా కూటమికి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ కు ఏమాత్రం కలిసిరావడం లేదు. నితీష్, మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటూ అంటముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటో వేచి చూడాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి