AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. రూ. 264.99 కోట్లు విడుదల

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264,99,00,983లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాలో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ తెలిపారు. టీడీపీ […]

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. రూ. 264.99 కోట్లు విడుదల
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 9:15 AM

Share

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264,99,00,983లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాలో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ తెలిపారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ కోరినా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కూలీలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు ఎంతోమంది అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసి నష్టపోయారు. అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ ద్వారా వైఎస్‌ జగన్‌ వారికి అండగా నిలిచారు. ఎన్నికల ముందు వారికి ఇచ్చిన హామీ ప్రకారం బడ్జెట్ లో రూ.1,150 కోట్లు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ చైర్మన్, కలెక్టర్లు ప్రతిపాదించిన ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిటర్ల జాబితాకు అనుగుణంగా పంపిణీ చేయనున్నారు. రూ.20 వేల డిపాజిట్లకు సంబంధించి కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది.

Follow Us
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం