మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

|

Jun 08, 2020 | 8:46 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మత్స్యకారుల వలసలను తగ్గించడమే కాకుండా వారి జీవనోపాధిని పెంచేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తూర్పుగోదావరిలోని ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, శ్రీకాకుళంలోని బడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరులోని నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ప్రాంతాల్లో మేజర్ ఫిషింగ్ హర్బర్లను, శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, గతంలో ఏపీలో ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లకు ఉన్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీ నుంచి ప్రతీ ఏటా 25 వేల మందికి పైగా మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరానికి వలస వెళ్తున్నారన్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం మత్స్యకారుల బాగు కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..