ఆంధ్రరాష్ర్ట అవతరణ దినోత్సవం వేడుకలను ఏపీ సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంకోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మరోవైపు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని, వాటిని కొనసాగించాలన్నారు.