ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు

|

Aug 02, 2020 | 9:20 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు, ఎన్ని వెంటిలేటర్ల అందుబాటులో ఉన్నాయ‌నే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు
Follow us on

Andhra corona hospitals : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు, ఎన్ని వెంటిలేటర్ల అందుబాటులో ఉన్నాయ‌నే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరోగ్య శాఖ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచింది. వివిధ జిల్లాల్లోని కొవిడ్ ఆస్పత్రుల్లో శనివారం సాయంత్రం నాటికి 24,738 ప‌డ‌క‌ల‌తో పాటు 1,171 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు.

జిల్లాల వారీగా వివరాలు : 

శ్రీకాకుళం జిల్లాలో 3,847 బెడ్లు 23 వెంటిలేటర్లు
విజయనగరం జిల్లాలో 1,258 బెడ్లు, 15 వెంటిలేటర్లు
విశాఖపట్నం జిల్లాలో 4,456 బెడ్లు 207 వెంటిలేటర్లు
తూర్పు గోదావరి జిల్లాలో 1,813 బెడ్స్, 60 వెంటిలేటర్స్
పశ్చిమ గోదావరి జిల్లాలో 1,369 బెడ్స్,15 వెంటిలేటర్లు
కృష్ణా జిల్లాలో 1,736 బెడ్స్, 117 వెంటిలేటర్స్
గుంటూరు జిల్లాలో 1,496 బెడ్స్, 186 వెంటిలేటర్స్
ప్రకాశం జిల్లాలో 114 బెడ్స్, 96 వెంటిలేటర్లు
నెల్లూరు జిల్లాలో 1073 పడకలు, 167 వెంటిలేటర్లు,
అనంతపురం జిల్లాలో 1854 బెడ్లు,16 వెంటిలేటర్లు,
చిత్తూరు జిల్లాలో 3,002 బెడ్లతో పాటు 122 వెంటిలేటర్లు
కడపలో 385 బెడ్స్, 52 వెంటిలేటర్లు,
కర్నూలు జిల్లాలో 2,335 బెడ్స్ తో పాటు 95 వెంటిలేటర్లు

 

Also Read : రిమ్స్ నుంచి 10 మంది క‌రోనా బాధితులు ప‌రార్