మాజీ క్రికెటర్ సిద్ధూకి యాంకర్ రష్మి కౌంటర్

మాజీ క్రికెటర్ సిద్ధూకి యాంకర్ రష్మి కౌంటర్

పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దేశం మొత్తం పాకిస్తాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. పుల్వామా దాడికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా నెటిజన్లతో పాటు చాలామంది సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లోనే ఉంటూ పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై కూడా ఆగ్ర‌హం క‌ట్టలు తెచ్చుకుంటోంది. మాజీ క్రికెట‌ర్ సిద్ధు ఉగ్ర‌వాదానికి దేశంతోనూ, మ‌తంతోనూ సంబంధం లేద‌ని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం లేపాయి. అలాగే కొంద‌రు యువ‌కులు కూడా సోషల్ మీడియా వేదిక‌గా […]

Ram Naramaneni

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:10 PM

పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దేశం మొత్తం పాకిస్తాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. పుల్వామా దాడికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా నెటిజన్లతో పాటు చాలామంది సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లోనే ఉంటూ పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై కూడా ఆగ్ర‌హం క‌ట్టలు తెచ్చుకుంటోంది. మాజీ క్రికెట‌ర్ సిద్ధు ఉగ్ర‌వాదానికి దేశంతోనూ, మ‌తంతోనూ సంబంధం లేద‌ని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం లేపాయి. అలాగే కొంద‌రు యువ‌కులు కూడా సోషల్ మీడియా వేదిక‌గా పాక్‌కు, టెర్రరిస్టులకు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తుండటం పలువురికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.
ఇటువంటి వ్యాఖ్య‌ల‌పై యాంక‌ర్, నటి  ర‌ష్మి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. `పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న సిద్ధు.. దేశ విభ‌జ‌న స‌మ‌యంలోనే పాకిస్థాన్‌కు వెళ్లిపోవాల్సింది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆయ‌న ఇప్ప‌టికీ ఈ దేశంలోనే ఉన్నాడ‌ని వ్యాఖ్యానించింది. అలాగే `పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్‌` అంటూ షోయెబ్ హ‌ఫీజ్ అనే నెటిజ‌న్ ట్వీట్‌కు స్పందిస్తూ.. `సాలే.. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్ప‌త‌నం? మాతోనే నీకు అస్థిత్వం. దేశ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డానికి సిగ్గు లేదా? మూసుకుని కూర్చో. లేక‌పోతే పాకిస్తాన్ వెళ్లిపో` అంటూ ఘాటుగా స్పందించింది. రష్మి బయటకు బోల్డ్ స్టేట్మెంట్స్  ఇస్తున్నా…మనసు చాలా సెన్సిటీవ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఏది ఏమైనా రష్మి ఇచ్చిన కౌంటర్స్‌కి ఆమె ఫ్యాన్స్ హ్యపీ ఫీల్ అవుతున్నారు. ఇంత జరిగినా స్ఫందించని పలువురు బడా సెలబ్రిటీల కంటే ఒక భారతీయ పౌరురాలుగా  రష్మి చాలా బెటర్ అని కితాబిస్తున్నారు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu