మా జీవితాలతో చెలగాటం వద్దు : అమృత ప్రణయ్‌

|

Aug 04, 2020 | 5:42 PM

రాంగోపాల్ వర్మ తమ జీవితాలపై సినిమా తీయడం పట్ల అమృత ప్రణయ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా.. తమ పేర్లు, జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్‌‌ సినిమా తీసి జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అమృత ప్రణయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

మా జీవితాలతో చెలగాటం వద్దు : అమృత ప్రణయ్‌
Follow us on

రాంగోపాల్ వర్మ తమ జీవితాలపై సినిమా తీయడం పట్ల అమృత ప్రణయ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా.. తమ పేర్లు, జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్‌‌ సినిమా తీసి జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అమృత ప్రణయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మర్డర్‌‌ స్టోరీలో తమ పేర్లు, ఫొటోలు వాడుకున్నందుకు, సినిమాను నిలిపేయాలని కోరుతూ గత నెల 29న నల్గొండ కోర్టులో సూట్‌ ఫైల్‌ చేసినట్లు ఆమె తెలిపారు. సినిమా దర్శకుడు, నిర్మాతకు కోర్టు నోటీసులు ఇచ్చిందని, వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా వాటిని పంపిందన్నారు. దీనిపై ఈ నెల 6న నల్గొండ కోర్టులో విచారణ ఉందని, సినిమా దర్శకుడు, నిర్మాత విచారణకు హాజరు కావాల్సి ఉందని అమృత చెప్పారు.

రెండేళ్లుగా మానసిక ఒత్తిడికి గురవుతున్న తనను ఈ సినిమా తీసి ఇంకా మనో వేదనకు గురి చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మిర్యాలగూడలో జరిగిన వాస్తవిక కథ ఆధారంగా మర్డర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో సంచలన కలిగించిన ప్రణయ్‌ హత్య, మారుతిరావు ఆత్మహత్యకు సంబంధించిన సంఘటనల ఆధారంగా మర్డర్‌ సినిమా తీస్తున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. ఈ మేరకు దాని టీజర్‌‌ను కూడా ఇటీవల విడుదల చేశారు. దీంతో స్పందించిన అమృత ప్రణయ్‌ మర్డర్ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.