మనుగడలోనే మండలి: అంబటి రాంబాబు సెన్సేషనల్ కామెంట్

| Edited By: Pardhasaradhi Peri

Jan 27, 2020 | 7:02 PM

శాసనమండలి రద్దుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ రద్దైనా శాసన మండలి ఇప్పుడప్పుడే రద్దు కాదన్నారు. పార్లమెంటు ఆమోదం తెలిపి.. దానికి రాష్ట్రపతి రాజముద్ర వేసే వరకు శాసనమండలి మనుగడలోనే వుంటుందని చెప్పారు అంబటి రాంబాబు. 133 ఎమ్మెల్యేల మద్దతుతో అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన తర్వాత శాసనసభ ఆవరణలో అంబటి మీడియాతో మాట్లాడారు. శాసనమండలి చరిత్రను వివరించారు. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిన సోమవారం చరిత్రలో […]

మనుగడలోనే మండలి:  అంబటి రాంబాబు సెన్సేషనల్ కామెంట్
Follow us on

శాసనమండలి రద్దుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ రద్దైనా శాసన మండలి ఇప్పుడప్పుడే రద్దు కాదన్నారు. పార్లమెంటు ఆమోదం తెలిపి.. దానికి రాష్ట్రపతి రాజముద్ర వేసే వరకు శాసనమండలి మనుగడలోనే వుంటుందని చెప్పారు అంబటి రాంబాబు.

133 ఎమ్మెల్యేల మద్దతుతో అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన తర్వాత శాసనసభ ఆవరణలో అంబటి మీడియాతో మాట్లాడారు. శాసనమండలి చరిత్రను వివరించారు. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిన సోమవారం చరిత్రలో నిలిచిపోతుందంన్నారు. 1984 మార్చిలో ఎన్టీఆర్ హయాంలో శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని, అది 1985 మే 31న పార్లమెంటు ఆమోదంతో రద్దయ్యిందని వివరించారు అంబటి.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2004 జూలై 8న శాసన మండలి పునరుద్దరణకు తీర్మానం చేయగా.. 2007 జనవరిలో మండలి తిరిగి ఏర్పాటైందన్నారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో కౌన్సిల్ పునరుద్దరణకు ప్రయ్నత్నం చేసినా పునరుద్ధరించడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేల బలంతో ఏర్పాటైన పూర్తి మెజార్టీ ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో 133 మంది సభ్యుల బలంతో మండలి రద్దు తీర్మానం ఆమోదించిందని చెప్పారు అంబటి.

శాసన మండలిలో మెజారిటీ వుందన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ లిటిగేషన్ ధోరణిని, పేచీ తనాన్ని అవలంభిస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. మండలి రద్దుకు చంద్రబాబు ప్రధాన కారణమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో ఘోరంగా ఓడిన చంద్రబాబు.. పెద్దల సభలో పెత్తనం చేయాలని చూస్తున్నారని అన్నారు. శాసనమండలిలో మేధావులు చాలా మందే వున్నా.. నారా లోకేశ్ లాంటి వారు చేరి పెద్దల సభను భ్రష్టు పట్టించారని రాంబాబు వ్యాఖ్యానించారు.

కేంద్రంతో సంప్రదింపులు జరిపి వీలైనంత త్వరగా మండలి రద్దుకు పార్లమెంటు ఆమోదం పొందుతామని, అయితే.. పార్లమెంటు ఆమోదం, రాష్ట్రపతి రాజముద్ర పడే వరకు మండలి మనుగడలో వున్నట్లే భావించాల్సి వుంటుందని అన్నారు అంబటి.