Amanchi And Karanam Balaram: నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఒకే వేదికపై కనిపించారు. ఈ ఇద్దరి నేతలను ‘వైఎస్సార్ ఇళ్ల పట్టాల పంపిణీ’ కార్యక్రమం కలిపింది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇదే హాట్ టాపిక్. చీరాలలో జరిగిన పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కార్యక్రమంలో కరణం, ఆమంచి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు.
ఇటీవల చీరాలలో మత్స్యకారుల మధ్య నెలకొన్న గొడవల నేపథ్యంలో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతలు తిరిగి ఒకే వేదికపైకి వస్తే ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఉద్దేశ్యంతో పోలీసులు వారి అనుచరులను కార్యక్రమానికి అనుమతించలేదు. సభా ప్రాంగణానికి కూడా రాకుండా ముందే ఇరువైపులా కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో వేదికపై మంత్రి బాలినేనితో పాటు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆశీనులయ్యారు. ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read:
Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!
కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!
ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!
షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!