కరోనా సంక్షోభంలో కూడా ఈ ఏడాదిని గట్టెక్కించిన సినిమాలు ఇవే.. వచ్చే సంక్రాంతి హడావిడంతా కుర్రహీరోలదే

ఈ ఏడాది కరోనా కలకాలంతో సతమతమైన సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.

కరోనా సంక్షోభంలో కూడా ఈ ఏడాదిని గట్టెక్కించిన సినిమాలు ఇవే.. వచ్చే సంక్రాంతి హడావిడంతా కుర్రహీరోలదే
Follow us

|

Updated on: Dec 25, 2020 | 9:57 PM

ఈ ఏడాది కరోనా కలకాలంతో సతమతమైన సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. టాలీవుడ్ లో సంక్రాంతికి బరిలో దిగిన మహేష్, అల్లుఅర్జున్ ఇద్దరు విజయం సాధించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనీల్ రావిపూడి  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించరు. ఫ్యామీలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ ఖాతాలో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా కూడా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అందాల భామ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. గురుజీ మార్క్ కామెడీ, డైలాగ్ లతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక థమన్ అందించిన సంగీతం ఈ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. బన్నీ మరోసారి తన స్టైలిష్ నటనతో ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాలతో పాటు యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమాకూడా ఈఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ మూడు సినిమాలు కరోనా కంటే ముందు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కరోనా కారణంగా నెలల తరబడి సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. అదే సమయంలో ఓటీటీ లు ఊపందుకున్నాయి. చిన్న సినిమాలు చాలా ఓటీటీని నమ్ముకొని రిలీజ్ అయ్యాయి. నాని నటించిన ‘వి’ సినిమా కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. అలాగే అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాకూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇక కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ , ‘మిస్ ఇండియా’ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ‘పెంగ్విన్’ సినిమా ఫ్లాప్ అయ్యింది. ‘మిస్ ఇండియా’ సినిమా పర్లేదనిపించుకుంది. అదేవిదంగా ఇటీవల విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది.  ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కూడా మంచి టాక్ తెచ్చుకుంది.  ఇక ఓటీటీలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఏదైనా ఉంది అంటే అది సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ అనే చెప్పాలి. సుధాకొంగరు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాలిడ్ హిట్ ను అందుకుంది. సూర్య మరోసారి తన నటనతో కట్టిపడేసారు. సినిమా థియేటర్స్ లో విడుదలై ఉంటే భారీగా వసూల్ చేసి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా సంక్షోభం తరువాత థియేటర్స్ లో విడుదలైన మొదటిసినిమా ఇది. ఈ సినిమాకూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక వచ్చే ఏడాది కుర్రహీరోలంతా సంక్రాంతిని టార్గెట్ చేసుకొని బరిలోకి దిగుతున్నారు. వీరిలో రామ్ నాటించిన ‘రెడ్’ , రవితేజ’క్రాక్’ , రానా ‘అరణ్య’ , దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’, అఖిల్  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు సంక్రాంతికి రానున్నాయి. మరి ఈ సినిమాలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో చూడాలి.

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో