అల్లు అర్జున్ శుభాకాంక్షలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మలయాళ అభిమానులకు 2020 ఓనమ్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఓనం ప్రతీ ఒక్కరికి సుసంపన్నమైనది కావాలని ఆకాంక్షించారు.

అల్లు అర్జున్ శుభాకాంక్షలు

Updated on: Aug 31, 2020 | 1:57 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మలయాళ అభిమానులకు 2020 ఓనమ్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఓనం ప్రతీ ఒక్కరికి సుసంపన్నమైనది కావాలని ఆకాంక్షించారు. మలయాళ భాషలో తన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బన్నీ. హ్యాపీ ఓనమ్ 2020 కి యాష్ ట్యాగ్ జోడించాడు. కాగా, తెలుగు ప్రేక్షకులతోపాటు, అటు కేరళలోనూ అల్లు అర్జున్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అటు, తన నిర్మాత రాధా కృష్ణకు బన్నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రాధాకృష్ణ ఒక నిజమైన పెద్దమనిషి అంటూ ఆకాశానికెత్తాడు. రాధాకృష్ణ తన హారిక హాసిని బ్యానర్ ద్వారా తనకు ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అలవైకుంఠపురంలో’ వంటి అద్భుతమైన చిత్రాలు అందించారని గుర్తుచేసుకున్నాడు. ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు కలుగజేయాలని కోరుకుంటున్నట్టు బన్నీ తన మెసేజ్ లో పేర్కొన్నాడు.