
2019 సంక్రాంతితో పోలిస్తే.. 2020 పొంగల్ సీజన్‌కు పోటీ బాగా టఫ్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండగా.. వాటిల్లో రెండు బడా చిత్రాలు పక్కాగా రిలీజ్ డేట్‌తో అధికారిక పోస్టర్లను విడుదల చేశాయి. అందులో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా కాగా.. మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ. ఈ రెండు చిత్రాలు కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఆర్మీ మేజర్ లుక్‌లో మహేష్ అదరగొడుతుండగా.. మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్‌లో బన్నీ ఒక చేత్తో కోడిపుంజును పట్టుకుని.. వేరొక చేత్తో వేట కొడవలితో హోరాహోరీ పోరుకు సిద్దమయ్యాడు. ఈ రెండు మూవీస్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్స్‌కు విశేషదారణ కూడా లభించింది. ఇక వీరిద్దరూ జనవరి 12వ తేదీని లాక్ చేసుకోగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా అటూ ఇటూగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళతో పాటుగా విక్టరీ వెంకటేష్ ‘వెంకీ మామ’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించడానికి సిద్ధం చేస్తున్నాడు. ‘ఎఫ్2’ మాదిరిగానే పండగ సీజన్‌లో మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంత మంచివాడువురా’ కూడా పండగ రేస్‌లోనే ఉంది. మరి ఈ పంచ్ పటాకాలో ఏ చిత్రం భారీ స్థాయి కలెక్షన్స్ రాబట్టుకుంటుందో వేచి చూడాలి.
It’s official… #SarileruNeekevvaru in cinemas from Jan 12th, 2020!! This Sankranti will be my biggest and most special :):)
Thankyou @anilravipudi ?@vijayashanthi_m @iamRashmika @thisisDSP @RathnaveluDop @GMBents @AnilSunkara1 @AKentsOfficial @SVC_official pic.twitter.com/Q7l0BPTH74— Mahesh Babu (@urstrulyMahesh) October 12, 2019
#AlaVaikunthapurramuloo arriving at the theatres on 12th January, 2020. @alluarjun #Trivikram @hegdepooja @GeethaArts @haarikahassine @MusicThaman pic.twitter.com/lS4YHl6Zgo
— BARaju (@baraju_SuperHit) October 12, 2019