AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవుల్లో పుష్పరాజ్‌.. మాసిపోయిన షర్ట్‌, ఫ్యాంట్‌తో కేక పెట్టిస్తోన్న బన్నీ లుక్‌.. చూశారా..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప ఒకటి. సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కే మూడో చిత్రం ఇది కాగా

అడవుల్లో పుష్పరాజ్‌.. మాసిపోయిన షర్ట్‌, ఫ్యాంట్‌తో కేక పెట్టిస్తోన్న బన్నీ లుక్‌.. చూశారా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 20, 2020 | 9:40 AM

Share

Allu Arjun Pushpa: టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప ఒకటి. సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కే మూడో చిత్రం ఇది కాగా.. అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే రాజమండ్రిలోని మారేడుమిల్లి అడవిలో జరుగుతోంది. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్‌ని కానిచ్చేస్తున్నారు సుకుమార్. కాగా ఈ మూవీ షూటింగ్‌లో బన్నీకి సంబంధించిన ఓ లుక్‌ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో మాసిన షర్ట్‌, ఫ్యాంట్‌, బెల్డ్‌ చెప్పులతో రఫ్ లుక్‌లో బన్నీ కనిపిస్తున్నారు. ఇక ఈ లుక్‌పై వావ్‌ అంటూ అభిమానులు కామెంట్‌ పెడుతున్నారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 894 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,057 మంది)

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముత్తంశెట్టి క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరోను ఢీకొన్న ట్రక్కు.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్