మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

|

Apr 22, 2019 | 6:13 PM

మూడో దశ సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 116 ఎంపీ స్థానాల్లో మూడో దశ పోలింగ్ జరగనుంది. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత […]

మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
Follow us on

మూడో దశ సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 116 ఎంపీ స్థానాల్లో మూడో దశ పోలింగ్ జరగనుంది. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మూడో దశ పోలింగ్ లో కేరళ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వర్ పోటీ చేయనున్నారు. ఇక మూడోదశ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ కూడా ఈ దశలో కీలకంగా మారనుంది.