All Opposition Parties Support : అన్నదాతల భారత్ బంద్ కు పలు విపక్షాల మద్దతు, రాష్ట్రపతికి సంయుక్త లేఖ

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు ఈ నెల 8 న నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ కు అనేక ప్రతిపక్షాలు తమ మద్దతును ప్రకటించాయి. కాంగ్రెస్, డీ ఎం కె, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ సహా లెఫ్ట్ పార్టీలు,..

All Opposition Parties Support : అన్నదాతల భారత్ బంద్ కు పలు విపక్షాల మద్దతు, రాష్ట్రపతికి సంయుక్త లేఖ

Edited By:

Updated on: Dec 06, 2020 | 8:16 PM

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు ఈ నెల 8 న నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ కు అనేక ప్రతిపక్షాలు తమ మద్దతును ప్రకటించాయి. కాంగ్రెస్, డీ ఎం కె, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ సహా లెఫ్ట్ పార్టీలు, జమ్మూ కాశ్మీర్ లో కొత్తగా ఏర్పడిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్ కార్ డిక్లరేషన్ కూడా సంఘీభావాన్ని వెల్లడించాయి. ఈ పార్టీలన్నీ సంయుక్త ప్రకటనను విడుదల చేస్తూ రాష్ట్రపతికి పంపాయి. తక్షణమే రైతు చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని ఈ పార్టీలు కోరాయి. రైతుల న్యాయ సమ్మతమైన డిమాండును కేంద్రం అంగీకరించాలని అభ్యర్థించాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ సైతం మేమూ మీ వెంటే అన్నట్టు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తాము రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించింది. రైతులకు తమ నైతిక మద్దతు ఉంటుందని ఈ పార్టీ పేర్కొంది.

అటు ఐ ఎన్ టీ యూసీ, ఏ ఐ టీ యూ సి వంటి కార్మిక సంఘాలు కూడా తమ సపోర్ట్ ఉంటుందని పేర్కొన్నాయి.