రైతుల నిరసన ఉద్యమం నుంచి వైదొలగుతున్నాం, ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ

రైతుల నిరసన ఉద్యమం నుంచి  తాము తక్షణమే వైదొలగుతున్నామని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది.

రైతుల నిరసన ఉద్యమం  నుంచి వైదొలగుతున్నాం, ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ

Edited By: Anil kumar poka

Updated on: Jan 27, 2021 | 5:25 PM

రైతుల నిరసన ఉద్యమం నుంచి  తాము తక్షణమే వైదొలగుతున్నామని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. అసలు ఈ ఉద్యమం సాగుతున్న తీరే సరిగా లేదని ఈ సంస్థ కన్వీనర్ వీ.ఎం. సింగ్ అన్నారు. ఘాజీపూర్ బోర్డర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక ఈ ఆందోళనతో సంబంధాలు తెంచుకుంటున్నామని, కానీ రైతుల ప్రయోజనాలకోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. నిన్న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల గురించి ఆయన నేరుగా ప్రస్తావించకున్నా బహుశా ఇవే కారణమై ఉంటుందని సింగ్ అభిప్రాయపడినట్టు కనిపిస్తోంది. పైగా ఢిల్లీ పోలీసులు సుమారు 200 మందికి పైగా రైతులపై కేసులు పెట్టిన తీరు కూడా ఈ రైతు సంఘం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం జరిగిన అల్లర్లను తీవ్రంగా పరిగణించి తమ దర్యాప్తు ముమ్మరం చేశారు.