ఆస్కార్ అకాడమీ జాబితాలో అలియా భట్, హృతిక్ రోషన్

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా జరగాల్సిన వేడుకలు, ఈవెంట్లు అన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల వేడుక ఆస్కార్ వాయిదా ప‌డ్డ సంగ‌తి

ఆస్కార్ అకాడమీ జాబితాలో అలియా భట్, హృతిక్ రోషన్

Edited By:

Updated on: Jul 01, 2020 | 4:40 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా జరగాల్సిన వేడుకలు, ఈవెంట్లు అన్ని వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28, 2021లో జరగాల్సిన ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల వేడుక ఆస్కార్ ఏప్రిల్‌ 25న నిర్వహించబోతున్నట్లు అకాడమీ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ రూబిన్‌ పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), ప్ర‌తి ఏడాది అనేక మంది ప్రపంచ సినీ ప్రముఖులను అకాడమీలోకి ఆహ్వానిస్తుంది.

కాగా.. ఈసారి కరోనావైరస్ కారణంగా ఆస్కార్ వేడుక వాయిదా పడింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2020 సంవ‌త్స‌రానికి గాను అకాడమీ జాబితాలో చేర‌బోయే స‌భ్యుల వివ‌రాల‌ని ప్రచురించింది. హృతిక్ రోష‌న్‌, అలియా భ‌ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీతా లుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ప్రియ స్వామినాథ‌న్‌, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూస‌ర్స్ విషాల్ ఆనంద్ (వార్‌, భార‌త్‌) మ‌రియు సందీప్ క‌మ‌ల్‌( పానిప‌ట్ ,జ‌ల్‌) త‌దితరులు ఈ ఏడాది అకాడ‌మీ స‌భ్యులుగా ఉంటార‌ని పేర్కొన్నారు. మొత్తం 819 మంది స‌భ్యుల‌ని జాబితాలో చేర్చ‌గా, వివిధ క్యాట‌గిరీలు ఆధారంగా ఎంపిక చేశారు.