ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో సర్పంచుల సమావేశంలో పాల్గొన్న ఆమె స్వల్పంగా గాయ పడింది. ఈ ఘటనలో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి సర్పంచులు కూడా గాయ పడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.