దీపావళికి అక్షయ్ ‘లక్ష్మీ బాంబ్’ పేలనుంది..!

|

Sep 30, 2020 | 7:01 PM

దక్షిణాదిన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంచన' సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

దీపావళికి అక్షయ్ లక్ష్మీ బాంబ్ పేలనుంది..!
Follow us on

Akshay Kumar Lakshmi Bomb: దక్షిణాదిన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ‘కాంచన’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. గతంలో విడుదలైన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను మొదట ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నా.. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. అయితే అది ఇండియాలో కాదు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్ఏలలో దీపావళి కానుకగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.