AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుః అరెస్ట్‌పై అఖిలప్రియ చెల్లెలు ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలిః మౌనికారెడ్డి

బోయినపల్లి కిడ్నాప్ కేసులో తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అఖిల ప్రియ చెల్లెలు మౌనికారెడ్డి తెలిపారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుః అరెస్ట్‌పై అఖిలప్రియ చెల్లెలు ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలిః మౌనికారెడ్డి
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 08, 2021 | 9:16 AM

Share

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అఖిల ప్రియ చెల్లెలు మౌనికారెడ్డి తెలిపారు. తన అక్క అఖిలప్రియ కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. ఈ ఘటనలో స్వయంగా పాల్గొన్నారడంలో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులపై బలవంతంగా పోలీసు కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాపై అభియోగం మాత్రమేనని.. అనారోగ్యంగా ఉన్న అక్కాను జైలుకు పంపించడం దారుణమన్నారు మౌనికారెడ్డి. కిడ్నాప్ వ్యహరంలో పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలన్న ఆమె.. మా ప్రమేయం ఉంటే పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. 30 మంది పోలీసులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి మా అక్కను ఇబ్బంది పెట్టారని మౌనికారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని మా తమ్ముడిని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె అన్నారు. ప్రవీణ్, హరీష్ మాకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న వ్యక్తులేనన్న మౌనిక.. మా అక్క స్పాట్ లో ఉండి కిడ్నాప్ చేసినట్టు అంతా క్రియేట్ చేశారన్నారు. మా అక్కకు నిన్న హాస్పిటల్లో ఫిట్స్ వచ్చి పడిపోతే పోలీసులు అందరు చుట్టూ ఉండి చోద్యం చూశారని మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు.

భూవివాదానికి సంబంధించి స్పందించిన మౌనికారెడ్డి.. తమ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ ఇదీ అని.. తెలంగాణ డివైడ్ కాక ముందు నుండే మా నాన్న కంపెనీ పేరు మీద ఈ ల్యాండ్ ఉందన్నారు. మా నాన్న ఉండుంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. తప్పుని తప్పు అంటున్నందుకు మాకు శత్రువులు ఎక్కువ అయ్యారని మౌనికారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానం ఉందనే సాకుతో ఒక మనిషిని ఇంత విధంగా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఏవీ సుబ్బారెడ్డి నిన్న ఏ వన్ గా ఉన్నాడు.. రాత్రికి రాత్రి మళ్లీ మా అక్క పై A1 చేశారు. ఈ కేసుతో మా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదని, అతని ఇంటికి వెళ్లి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని మౌనికారెడ్డి అన్నారు. మాకే ఇక్కడ సేఫ్టీ లేదు.. ఇక్కడికి వస్తే ఎవరైనా రెస్పాన్సిబులిటీ ఇస్తానంటే తమ్ముడు వస్తాడని మౌనికారెడ్డి స్పష్టం చేశారు. ఈకేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలని మౌనికారెడ్డి డిమాండ్ చేశారు.

Bowenpally Kidnap Case Live Updates: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..