ట్రైలర్ టాక్: ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాళ్లు..
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’ తమిళ హిట్ సినిమా ‘కణా’కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ ఆగష్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. తన తండ్రి కలను నెరవేర్చేందుకు కూతురు పడ్డ కష్టమే ఈ చిత్ర కథాంశం అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ‘నీ వల్ల […]

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’ తమిళ హిట్ సినిమా ‘కణా’కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ ఆగష్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
తన తండ్రి కలను నెరవేర్చేందుకు కూతురు పడ్డ కష్టమే ఈ చిత్ర కథాంశం అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ‘నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు.. నిన్ను’ , ‘ఈ లోకం.. గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాళ్లు చెబితే వింటుంది. ఏం చెప్పినా గెలిచి చెప్పు’లాంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. తమిళ హీరో శివ కార్తీకేయన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ నిర్మిస్తోంది.