ఎయిర్‌టెల్, డిష్ టీవీ మధ్య విలీన చర్చలు

| Edited By:

Mar 21, 2019 | 12:42 PM

బిలియనీర్ సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలో ఎయిర్‌టెల్ డీటీహెచ్, డిష్ టీవీలు వాటి డీటీహెచ్ వ్యాపారాలను విలీనం చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకలాపాల స్థిరీకరణ, రిలయన్స్‌కు గట్టి పోటీ అనేవి చర్చల ప్రధాన లక్ష్యమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్‌టెల్ డీటీహెచ్, డిష్ టీవీ రెండు కలిపిపోతే అతి పెద్ద‌ డీటీహెచ్ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ముఖ్యాంశాలు… ఒకవేళ డీల్ ఓకే అయితే అప్పుడు 3.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో […]

ఎయిర్‌టెల్, డిష్ టీవీ మధ్య విలీన చర్చలు
Follow us on

బిలియనీర్ సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలో ఎయిర్‌టెల్ డీటీహెచ్, డిష్ టీవీలు వాటి డీటీహెచ్ వ్యాపారాలను విలీనం చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకలాపాల స్థిరీకరణ, రిలయన్స్‌కు గట్టి పోటీ అనేవి చర్చల ప్రధాన లక్ష్యమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్‌టెల్ డీటీహెచ్, డిష్ టీవీ రెండు కలిపిపోతే అతి పెద్ద‌ డీటీహెచ్ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ముఖ్యాంశాలు…

ఒకవేళ డీల్ ఓకే అయితే అప్పుడు 3.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా అవతరిస్తుంది. భారత్‌లోని డీటీహెచ్ మార్కెట్‌లో 61 శాతం వాటా ఈ కంపెనీదే అవుతుంది. 1.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో టాటా స్కై రెండో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది. దీని తర్వాతి స్థానంలో సన్ డైరెక్ట్, ఇండిపెండెంట్ టీవీ ఉంటాయి.