రోడ్డు ప్రమాదంలో తమిళనాడు ఎంపీ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఐఏడీఎంకే ఎంపీ రాజేంద్రన్ దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు విల్లపురం జిల్లా తిండివనమ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆయన స్పాట్‌లోనే మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. కాగా 2014 లోక్‌సభ ఎన్నికలలో విల్లుపురం నుంచి రాజేంద్రన్ ఎంపికయ్యారు. కాగా ఆయన మృతిపై ఏఐఏడీఎంకే పార్టీ దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది.

రోడ్డు ప్రమాదంలో తమిళనాడు ఎంపీ దుర్మరణం

Edited By:

Updated on: Mar 07, 2019 | 5:30 PM