ahavideoIN: ఆహా.! స్వప్న మెయిల్ వచ్చేసింది.. చెక్ చేసుకోవడం మర్చిపోకండి, మీ రిప్లైకోసం వెయిటింగ్అట..!

|

Dec 30, 2020 | 6:03 PM

వెబ్‌సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోన్న వేళ బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ప్రముఖ నిర్మాణ సంస్థలు, సినిమా నటులు డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నారు...

ahavideoIN: ఆహా.! స్వప్న మెయిల్ వచ్చేసింది.. చెక్ చేసుకోవడం మర్చిపోకండి, మీ రిప్లైకోసం వెయిటింగ్అట..!
Follow us on

వెబ్‌సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోన్న వేళ బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ప్రముఖ నిర్మాణ సంస్థలు, సినిమా నటులు డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అనుబంధసంస్థ స్వప్న సినిమాస్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘కంబాలపల్లి కథలు’ మెయిల్ చాప్టర్ 1 టీజర్ రిలీజ్ అయింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో వందశాతం తెలుగు వెబ్ సిరీస్, మూవీస్ అందించే ఆహా ద్వారా ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. దీనిలో ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఉదయ్‌ గుర్రాల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హైబత్‌ అనే పాత్రలో ప్రియదర్శి.. కంఫ్యూటర్ వచ్చిన కాలంలో సెంటర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్ కొనసాగుతుంది. ‘కంబాలపల్లి కథలు’ వెబ్ సిరీస్ నిర్మాత స్వప్న “రేపు 11 గంటలకి మెయిల్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి Love letter” అంటూ నిన్న చెప్పినట్టే ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. ఇక.. “మెయిల్ వచ్చేసింది, రిప్లైకోసం వెయిటింగ్” అంటూ తాజాగా ఆడియన్స్ లో మరింత ఆసక్తిని రేపుతున్నారు.