9 మంది రాజీనామాలు చెల్లవు: కర్ణాటక స్పీకర్‌

| Edited By:

Jul 10, 2019 | 4:40 AM

కర్ణాటకలో కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంకీర్ణాన్ని రాజీనామాలతో వణికిస్తున్న ఎమ్మెల్యేల జోరుకు స్పీకర్‌ రమేశ్‌ కుమార్ షాక్ ఇచ్చారు. తనకు ఇప్పటిదాకా 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అందాయని.. వీటిలో ఐదు మాత్రమే నిర్దిష్ట ఫార్మాట్‌లో ఉన్నాయని స్పష్టంచేశారు. మిగిలిన 9 మంది రాజీనామాలు చెల్లవని తేల్చేశారు. నిర్దిష్ట రూపంలో రాజీనామాలు ఇచ్చిన రామలింగారెడ్డి, గోపాలయ్య, ఆనంద్‌సింగ్‌, నారాయణ గౌడ, ప్రతాప్‌ గౌడ పాటిల్‌లపైనా వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఉత్కంఠను పెంచేశారు. నిబంధనల మేరకు వారంతా తన ముందు హాజరై.. […]

9 మంది రాజీనామాలు చెల్లవు: కర్ణాటక స్పీకర్‌
Follow us on

కర్ణాటకలో కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంకీర్ణాన్ని రాజీనామాలతో వణికిస్తున్న ఎమ్మెల్యేల జోరుకు స్పీకర్‌ రమేశ్‌ కుమార్ షాక్ ఇచ్చారు. తనకు ఇప్పటిదాకా 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అందాయని.. వీటిలో ఐదు మాత్రమే నిర్దిష్ట ఫార్మాట్‌లో ఉన్నాయని స్పష్టంచేశారు. మిగిలిన 9 మంది రాజీనామాలు చెల్లవని తేల్చేశారు. నిర్దిష్ట రూపంలో రాజీనామాలు ఇచ్చిన రామలింగారెడ్డి, గోపాలయ్య, ఆనంద్‌సింగ్‌, నారాయణ గౌడ, ప్రతాప్‌ గౌడ పాటిల్‌లపైనా వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఉత్కంఠను పెంచేశారు. నిబంధనల మేరకు వారంతా తన ముందు హాజరై.. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని నిర్ధారిస్తేనే వాటిని ఆమోదిస్తానని రమేశ్‌కుమార్‌ తెలిపారు. తనను కలిసేందుకు ఈనెల 12న కొందరికి, 15వ తేదీన మరికొందరికి సమయం కేటాయించారు. ‘‘ఎమ్మెల్యేలు ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారని నేను నిర్ధారించుకోవాల్సి ఉంది. నా నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి’’ అని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు.