కల్కీ ఖేల్ ఖతం.. మరి నెక్ట్స్ ఎవరు..?

వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది రూపాయలను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ, తమిళనాడులో కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు సోదాల్లో గుర్తించారు. ఇప్పటి వరకూ రూ.43.9 కోట్ల […]

కల్కీ ఖేల్ ఖతం.. మరి నెక్ట్స్ ఎవరు..?
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2019 | 2:11 PM

వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది రూపాయలను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ, తమిళనాడులో కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు సోదాల్లో గుర్తించారు. ఇప్పటి వరకూ రూ.43.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 40 ప్రాంతాల్లో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలు, వెల్‌‌నెస్ సెంటర్లు, కల్కి కుమారుడు కృష్ణ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ సోదాల్లో రూ.43.9 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విలువైన మిలియన్ యూఎస్ డాలర్లు, 26 కోట్ల విలువైన 88 కిలోల బంగారం, 5 కోట్ల విలువైన 1271 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2014-2015లో విదేశీ కంపెనీల్లో రూ. 409 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. 25 ఏళ్ల క్రితం కల్కి ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆశ్రమ పేరును తరుచూ మార్చడానికి కారణాలేంటన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ట్రస్టు ఆస్తులు, బినామీలు, భూములకు సంబంధించిన పత్రాలతో కూడిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కల్కీ దంపతులు అజ్ఞాతంలోకి వెళిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు. ఇదిలా వుంటే, కల్కి భగవాన్‌‌ను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ మొదలైంది. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిన స్వాములు, మఠాలు, ఆశ్రమాలు వేలాదిగా పుట్టుకొస్తున్నాయి.

ఊరికో ఆశ్రమం వెలుస్తోంది. రోజుకో బాబా పుట్టుకొస్తూ తాను ఓ దేవుడినని చెప్పుకుంటూ.. అమాయకుల నుంచి వేలకోట్లు దోచుకుంటున్నారు. ఆధ్యాత్మిక సేవ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి రాజకీయ నాయకులను కూడా శాసిస్తున్నారు. వారిని మాయలో పడేసి వేలకోట్లకు అధిపతులు అవుతున్నారు. ఇక కల్కీ భగవాన్ అంతం తర్వాత ఏపీలోని మరో ప్రముఖ స్వామి ఆశ్రమాలపై కూడా దాడులు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం చేస్తూ వేలకోట్లు కొల్లగొడుతున్న దొంగ స్వాముల ఆగడాలకు ఐటీ అధికారులు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన