Adilabad District Gun Fire : ఆదిలాబాద్ కాల్పుల ఘటన… చికిత్స పొందుతూ బాధితుడు జమీర్ మ‌ృతి…

ఎంఐఎం నేత ఫారుఖ్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్‌ను చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. కాగా, చికిత్స పొందుతున్న జమీర్ డిసెంబర్ 26న మృతి చెందాడు.

Adilabad District Gun Fire : ఆదిలాబాద్ కాల్పుల ఘటన... చికిత్స పొందుతూ బాధితుడు జమీర్ మ‌ృతి...

Edited By:

Updated on: Dec 26, 2020 | 8:33 AM

ఎంఐఎం నేత ఫారుఖ్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్‌ను చికిత్స కోసం నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మృతి చెందాడు. మరో బాధితుడు మొతీషిన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే డిసెంబర్ 18న ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్ తాటిగూడ కాలనీలో కాల్పులకు తెగబడ్డాడు. తుపాకితో ఇద్దరిపై కాల్పులు జరిపాడు, ఒకరిపై కత్తితో దాడి చేశాడు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఫారుఖ్ వినియోగించిన తుపాకీ లైసెన్స్ గడువు ముగిసినట్లుగా గతంలో పోలీసులు తేల్చారు.