కింగ్ ‘నాగ్ బర్త్‌డే సీడీపీ’ని లాంఛ్ చేసిన సమంత

స్టార్ హీరోల పుట్టిన రోజులు వస్తున్నాయంటే చాలు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హడావిడే వేరు. తమ ఫేవరెట్ హీరో ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూంటారు. అందులోనూ ఈ మధ్య తమ అభిమాన హీరో బర్త్‌ డేని ఇంకా నెల రోజులు, 10 రోజులు ఉందని తెలియగానే..

కింగ్  'నాగ్ బర్త్‌డే సీడీపీ'ని లాంఛ్ చేసిన సమంత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2020 | 1:58 PM

స్టార్ హీరోల పుట్టిన రోజులు వస్తున్నాయంటే చాలు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హడావిడే వేరు. తమ ఫేవరెట్ హీరో ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూంటారు. అందులోనూ ఈ మధ్య తమ అభిమాన హీరో బర్త్‌ డేని ఇంకా నెల రోజులు, 10 రోజులు ఉందని తెలియగానే సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్స్‌ మొదలు పెట్టేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు, పవన్ కల్యాణ్ పుట్టిన రోజులకు సీడీపీ ట్యాగ్ చేసి రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. ఇలా ఎంత ఎక్కువ ట్రెండ్ అయితే.. అంత పాపులర్ అట. కాగా ఈ నెల 29న కింగ్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా.. కోడలు అక్కినేని సమంత తన మామ నాగార్జున కామన్ డీపీని సోషల్ మీడియాలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా కింగ్ అభిమానులు.. సామ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. 2.35 కోట్లకి చేరిన కేసులు