“ప్రవేట్ లైఫే లేకుండా పోయింది”

|

Sep 21, 2020 | 8:50 PM

టెక్నాలజీ రోజురోజుకు అప్ గ్రేడ్ అవుతోంది. దానివల్ల ఎంత లాభమో, అంతే నష్టం కూడా ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా మన వ్యక్తిగత సమాచారం అంతా దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ విషయంలో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది సమంత. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల ‘సోషల్ డైలమా’ అనే వెబ్ సిరీస్ చూసినప్పుడు చాలా భయం వేసిందని తెలిపింది. ప్రజంట్ మన జీవితాలను డేటా అనే అంశం రూల్ చేస్తోందని, ప్రవేట్ లైఫే […]

ప్రవేట్ లైఫే లేకుండా పోయింది
Follow us on

టెక్నాలజీ రోజురోజుకు అప్ గ్రేడ్ అవుతోంది. దానివల్ల ఎంత లాభమో, అంతే నష్టం కూడా ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా మన వ్యక్తిగత సమాచారం అంతా దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ విషయంలో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది సమంత. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల ‘సోషల్ డైలమా’ అనే వెబ్ సిరీస్ చూసినప్పుడు చాలా భయం వేసిందని తెలిపింది. ప్రజంట్ మన జీవితాలను డేటా అనే అంశం రూల్ చేస్తోందని, ప్రవేట్ లైఫే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయంపై సుదీర్ఘంగా మాట్లాడింది సమంత.

ప్రస్తుతం సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చెయ్యడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. తన నంబర్ కు అప్పుడప్పుడు ‘మీ అకౌంట్ లో ఎవరో లాగిన్ అవ్వడానికి అది మీరేనా’ మెసేజ్ వస్తుందని ఆమె వెల్లడించింది. ఎవరికైనా నంబర్ ఇస్తే మన వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చినట్టే అని అభిప్రాయపడింది. క్యాబ్ కావాలంటే ఫోన్ నంబర్ ఇవ్వాలి, ఫుడ్ కావాలంటే ఫోన్ నంబర్ ఇవ్వాలి, షాపింగ్ చేస్తే ఫోన్ నంబర్ ఇవ్వాలి..ఇలా ఇచ్చిన తర్వాత వచ్చే సమస్యలు అన్నీ, ఇన్నీ కాదని పేర్కొంది. కోవిడ్ సమయంలో ప్లాస్మా డొనేషన్ తదితర అంశాల్లో సోషల్ మీడియా ఉపయోగపడిందని, అదే సమయంలో రకరకాల ఫేక్ న్యూస్ వ్యాప్తి కూడా జరిగిందని సమంత చెప్పుకొచ్చింది. దీని వల్ల లాభం ఎంత ఉందో, నష్టం అంతే ఉందని అభిప్రాయపడింది.

Also Read :

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !