గరికపాటిని కట్టిపడేసిన సాయిపల్లవి

ఆధ్యాత్మిక ప్రవచకులు గరికపాటి నరసింహారావు మనసు దోచేసింది కుర్ర హీరోయిన్ సాయిపల్లవి. ఆమె తీసుకున్న నిర్ణయమే దీనికి కారణమైంది. చేతులెత్తి నమస్కరిస్తున్నాంటూ చెప్పిన గరికపాటి.. ఈ మధ్య కాలంలో..

గరికపాటిని కట్టిపడేసిన సాయిపల్లవి

Updated on: Aug 26, 2020 | 8:25 PM

ఆధ్యాత్మిక ప్రవచకులు గరికపాటి నరసింహారావు మనసు దోచేసింది కుర్ర హీరోయిన్ సాయిపల్లవి. ఆమె తీసుకున్న నిర్ణయమే దీనికి కారణమైంది. చేతులెత్తి నమస్కరిస్తున్నాంటూ చెప్పిన గరికపాటి.. ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్స్ లలో సాయి పల్లవి అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఇటీవల ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కురచ దుస్తువులు వేసుకొనని చెప్పడం ఆమెపై ఎంతగానో గౌరవం పెరిగేలా చేసిందన్నారు. తన సినిమాను నా తల్లిదండ్రులు చూస్తుంటే ఇబ్బంది పడకూడదు. రేపు నా పిల్లలు కూడా మంచి మనసుతో నా సినిమాలు చూసేలా ఉండాలని ఆమె చెప్పిన విధానం తనను బాగా ఆకర్షించిందని గరకపాటి తన ప్రవచనాల సందర్భంలో చెప్పుకొచ్చారు. అందుకే రెండు చేతులెత్తి సమస్థ సన్మంగళని బవంతు అనేశానని చెప్పారు గరికపాటి. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.