Ramyakrishna : కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ పై సినీనటి రమ్యకృష్ణ అద్భుతమైన రియాక్షన్

|

Jul 24, 2021 | 8:38 AM

తెలంగాణ ఐటీ.. పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా..

Ramyakrishna : కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ పై సినీనటి రమ్యకృష్ణ అద్భుతమైన రియాక్షన్
Ramyakrishna On Ktr Birthda
Follow us on

Mukkoti Vruksharchana – Ramyakrishna – KTR birthday : తెలంగాణ ఐటీ.. పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చనపై ప్రముఖ సినీనటి రమ్యకృష్ణ స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రత్యేక వీడియోతో ముందుకొచ్చారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఒకే రోజు మూడు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించడం అద్భుతమన్నారు రమ్యకృష్ణ.

ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో అందరం తప్పక పాల్గోవాలని రమ్యకృష్ణ పిలుపునిచ్చారు. పుట్టినరోజు నాడు కేటీఆర్‌కు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదేని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పుడమితల్లిని, పర్యావరణాన్ని కాపాడుకోడానికి ఒక మంచి కార్యక్రమంగా ఆమె అభివర్ణించారు. ఇలా ఉండగా, కేటీఆర్ పుట్టిన రోజు వేళ ఒక్క గంటలోనే ముక్కోటి మొక్కలు నాటాలని ముందుగా నిర్ణయించినప్పటికీ వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ నిబంధనను సడలించినట్టు ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

మరోవైపు, ముక్కోటి వృక్షార్చనలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ (శనివారం) మొత్తం 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. మొక్కల కోసం పంచాయితీరాజ్‌ నర్సరీలు, అటవీ, మున్సిపల్‌ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించారు. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనేవారంతా తాము నాటిన మొక్కతో ఫొటోదిగి 90003 65000 నంబర్‌కు వాట్సప్‌చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తిచేశారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసిరావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ సందర్బంగా మరోసారి పిలుపునిచ్చారు.

అటు, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 46లోని జీహెచ్‌ఎంసీ పార్కులో ‘సైయంట్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి శుక్రవారమే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read also : Godavari : గోదారమ్మ పరవళ్లు.. భద్రాచలం దగ్గర పెరిగిపోతోన్న నీటిమట్టం, కృష్ణా పరివాహకప్రాంత ప్రాజెక్టులకు జలసరి