Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపింది. వైద్య పరీక్షల రిపోర్ట్స్ అన్నీ వచ్చాయని..

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

Updated on: Dec 27, 2020 | 5:46 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అపోలో డాక్టర్లు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని చెప్పారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ అన్నీ వచ్చాయని..  అంతా సవ్యంగానే ఉన్నట్లు  వెల్లడించారు. వారం పాటు రజనీ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని అపోలో వైద్యులు సూచించారు. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులతో ఇటీవల కాంటాక్ట్ అయిన నేపథ‌్యంలో ఎవరిని కలవొద్దని రజనీని కోరారు. కాసేపట్లో సూపర్ స్టార్ చెన్నై బయలుదేరనున్నారు.

అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్  తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సినిమా షూటింగ్ సమయంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో షూటింగ్‌కు క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆయన నగరంలోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం బీపీ పెరగడంతో రజినీని అపోలో హాస్పిటల్‌ చేర్పించి.. చికిత్స అందించారు.

Also Read : COVID Vaccine : మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం