ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు కృష్ణంరాజు, అశ్వనీదత్

|

Sep 28, 2020 | 9:52 PM

నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌ - ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించాలే ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని కృష్ణంరాజు పిటిషన్‌ వేశారు.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు కృష్ణంరాజు, అశ్వనీదత్
Follow us on

నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌ – ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించాలే ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని కృష్ణంరాజు పిటిషన్‌ వేశారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు – తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మరో వైపు తన 39 ఎకరాలకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు అశ్వనీదత్‌. ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ భూమి ఎకరానికి రూ. కోటి 54 లక్షల విలువ ఉందని తెలిపారు. ఈ భూమికి సరిసమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పుడు రాజధానిని వేరే చోటకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

దీంతో అక్కడి భూమి ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని చెప్పారు. తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ అశ్వినీదత్‌ పిటిషన్‌ వేశారు.

ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ వాల్యూ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందన్నారు. ల్యాండ్‌ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని పిటిషన్‌లో అశ్వినీదత్‌ పేర్కొన్నారు. అశ్వినీదత్‌ తరపున హైకోర్టులో న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ పిటిషన్‌ వేశారు.