గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. వ్యాపారుల వేధింపులు భరించలేక ఓ అకౌంటెంట్ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరానికి చెందిన రావిపాటి బసవయ్యతో శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి కొద్దిరోజులుగా బసవయ్యను ఇద్దరూ వేధింపులు గురిచేస్తున్నారంటూ.. ఆత్మహత్యకు ముందు బసవయ్య సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
వ్యాపారం పేరుతో శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు వేధించారని ఆవేదన చెందాడు. హోంమంత్రి పేరుతో తమ కుటుంబం అంతుచూస్తామని బెదిరించారని వాపోయారు. ఇదేక్రమంలో పట్టాభిపురం పీఎస్‌కు పిలిచి వేధించారని వీడియోలో బసవయ్య పేర్కొన్నారు. వారిని ఏం చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు. తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బసవయ్య వేడుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెస్తున్నట్లు గుంటూరు పోలీసులు తెలిపారు.