పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తుల గుర్తింపు.. ఏసీబీ అదుపులో అధికారి

|

Dec 16, 2020 | 7:31 AM

చెన్నై: దేశంలో ఏసీబీ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అవినీతికి అలవాటు పడిన అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారులు అవినీతికి పాల్పడకుండా ఏసీబీ అధికారులు దాడులు ...

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తుల గుర్తింపు.. ఏసీబీ అదుపులో అధికారి
ACB raids
Follow us on

చెన్నై: దేశంలో ఏసీబీ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అవినీతికి అలవాటు పడిన అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారులు అవినీతికి పాల్పడకుండా ఏసీబీ అధికారులు దాడులు చేపడుతున్నా.. ఇంకా అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ కొరఢా ఝులిపిస్తోంది.

తాజాగా చెన్నైలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఇంటిపై ఏసీబీ దాడి జరిగింది. సైదాపేటలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పని చేస్తున్న పాండియన్ అనే అధికారి పరిశ్రమల అనుమతుల కోసం భారీగా నగదు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగి ఈ దాడులు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. కోట్లల్లో ఆస్తులను ఉన్నట్లు గుర్తంచారు ఏసీబీ అధికారులు.

ఇంట్లో విలువైన వజ్రాలు, మూడు కిలోల బంగారం, 3.5 కిలోల వెండి, రూ.1.37 కోట్ల నగదు, 18 ప్రాంతాల్లో రూ.50 కోట్ల విలువ చేసే ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాండియన్ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.