తెరపైకి ఓటుకు నోటు.. ఏ1 రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారా..? ఏం జరగనుంది..?

దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి.. డ్రోన్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యాక జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఇవాళ ఓటుకు నోటు కేసులో భాగంగా.. […]

తెరపైకి ఓటుకు నోటు.. ఏ1 రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారా..? ఏం జరగనుంది..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 17, 2020 | 7:14 AM

దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి.. డ్రోన్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యాక జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఇవాళ ఓటుకు నోటు కేసులో భాగంగా.. ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డిని.. ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో నిందితుల పాత్ర, అసలు సూత్రధారులకు సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు.

ఇదిలావుంటే.. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టును కూడా కోర్టుకు అందజేశారు. 2015లో స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీ ఓటు విషయంలో రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది ప్రస్తుతం కీలకం కానుంది. అయితే అంతకుముందే స్టీఫెన్‌సన్.. ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో.. రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు.

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు