చంద్రబాబు అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కోర్టు ఏం చెప్పిందంటే..!

| Edited By:

Jan 24, 2020 | 7:32 PM

చంద్రబాబు అక్రమాస్తుల కేసుపై లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు నేడు విచారణ ప్రారంభించింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని, ఆ ఆస్తుల పై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్ లో పేర్కొంది. పిటీషన్ పై ఏసీబీ కోర్టు నేడు మరోసారి విచారించింది. చంద్రబాబు పై ఏసీబీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించాలని లక్ష్మీ పార్వతి కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు పై హైకోర్టులో ఉన్న స్టే వివరాలను […]

చంద్రబాబు అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కోర్టు ఏం చెప్పిందంటే..!
Follow us on

చంద్రబాబు అక్రమాస్తుల కేసుపై లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు నేడు విచారణ ప్రారంభించింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని, ఆ ఆస్తుల పై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్ లో పేర్కొంది. పిటీషన్ పై ఏసీబీ కోర్టు నేడు మరోసారి విచారించింది. చంద్రబాబు పై ఏసీబీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించాలని లక్ష్మీ పార్వతి కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు పై హైకోర్టులో ఉన్న స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7 కు వాయిదా వేసింది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాలని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి పిటిషన్ వేసిన విషయం విదితమే.