ఏసీపీ నరసింహా రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

|

Oct 02, 2020 | 10:48 PM

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహా రెడ్డి తోపాటు మరొక 8 మంది పై తాజాగా కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో సెప్టెంబర్ 23న సోదాలు నిర్వహించిన ఏసీబీ.. నరసింహ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో జోక్యం చేసుకున్న నరసింహారెడ్డి.. బినామీల పేర్లతో మాదాపూర్ తోపాటు పలుచోట్ల స్థలాలు, ఇళ్లు, వివిధ రకాల ఆస్తులు దక్కించుకున్నారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మాదాపూర్ లోని ఒక్క ఆస్తి […]

ఏసీపీ నరసింహా రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Follow us on

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహా రెడ్డి తోపాటు మరొక 8 మంది పై తాజాగా కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో సెప్టెంబర్ 23న సోదాలు నిర్వహించిన ఏసీబీ.. నరసింహ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో జోక్యం చేసుకున్న నరసింహారెడ్డి.. బినామీల పేర్లతో మాదాపూర్ తోపాటు పలుచోట్ల స్థలాలు, ఇళ్లు, వివిధ రకాల ఆస్తులు దక్కించుకున్నారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మాదాపూర్ లోని ఒక్క ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపుగా 50 కోట్లు చేస్తుందని ఏసీబీ అంచనాకు వచ్చింది. ఇందులో ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో లాండ్ nu స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్ధారించింది. Acp నర్సింహారెడ్డి సాయం చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేసి ఇవాళ రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు.